రవ్వ కేసరి
Serves :
6
Preparation Time :
Cooking Time :
Preparation Method :
- ఒక పాన్ వేడి చేసుకొని అందులో 2 టీ స్పూన్ నెయ్యి,రవ్వ వేసుకొని వేగనివ్వాలి.వేగిన తరువాత పక్కన పెట్టుకోవాలి.
- పాన్ లో ఇంకా నెయ్యి వేసి జీడి పప్పు, కిస్మిస్ వేసి వేగనివ్వాలి.
- ఒక పెద్ద పాన్ తీసుకొని అందులో 600 మిల్లి లీటర్ నీళ్ళు పోసుకొని కొంచెం సేపు కాగపెట్టాలి.
- కాగిన తరువాత అందులో కేసరి రంగు పొడి మరియు కాల్చిన రవ్వ (గడ్డలు లేకుంగా) వేసి ఉడకనివ్వాలి.
- అందులో మళ్ళీ నెయ్యి,జీడి పప్పు,కిస్మిస్,ఏలకుల పొడి వేసి కొంచెం మంటతో ఉడకనివ్వాలి.
- కేసరి నుంచి నెయ్యి వేరుగా వచ్చినపుడు మంట నుండి తీసేయ్యాలి.
- అది ఒక గిన్నెలో మార్చుకోండి.
- అంతే వేడి వేడి రవ్వ కేసరి సిద్దం.
INGREDIENTS
- 200 గ్రాం రవ్వ
- 300 గ్రాం చక్కెర
- 50 మిల్లి లీటర్ నెయ్యి
- చిటికెడు కేసరి రంగు పొడి
- 30 గ్రాం జీడి పప్పు
- 20 గ్రాం కిస్మిస్
- 1 స్పూన్ ఏలకుల పొడి
- 600 మిల్లి లిట్టేర్ నీళ్ళు
1 comment for “రవ్వ కేసరి”
©Copyright 2012, lekhafoods, All Rights Reserved